రమేశ్‌ ఆత్మహత్య బాధాకరం: మాణికం ఠాగూర్‌

రెండు పడకగదుల ఇల్లు రద్దయిందన్న మనస్తాపంతో సిద్దిపేట జిల్లాలో సోమవారం రమేశ్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 07 Dec 2022 05:30 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రెండు పడకగదుల ఇల్లు రద్దయిందన్న మనస్తాపంతో సిద్దిపేట జిల్లాలో సోమవారం రమేశ్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రమేశ్‌ బలవన్మరణంపై ఆయన మంగళవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు అధికారం అనుభవిస్తూ, దిల్లీ మద్యం స్కాంలో దళారులుగా వ్యవహరిస్తూ ఆనందిస్తుంటే రమేశ్‌ కుటుంబం దుఃఖంలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో ఎప్పుడు ముగుస్తుందోనని ఠాగూర్‌ విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా రెండుపడక గదుల ఇళ్ల మంజూరులో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని, దీనిపై సీఎం సమీక్ష జరపాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌ చేశారు. 

* రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు అంజన్‌కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, టి.కుమార్‌రావు తదితరులు మంగళవారం గాంధీభవన్‌లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మల్లు రవి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ జడ్పీ ఛైర్మన్‌ ఎస్సీ రిజర్వ్‌ అయితే నాన్‌ ఎస్సీకి ఛైర్మన్‌ పదవి ఇచ్చారని, ఇది సరికాదన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని