Rasamayi Balakishan: సీఎం కన్నా పెద్ద చదువు నాదే: ఎమ్మెల్యే రసమయి

మానకొండూర్‌ ఎమ్మెల్యేగా ఉండి డాక్టరేట్‌ సాధించానని, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుల కన్నా పెద్ద చదువు తనదేనని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

Updated : 07 Dec 2022 07:56 IST

అంబేడ్కర్‌ ఆలోచన విధానంతోనే ఇది సాధ్యమైంది

శంకరపట్నం, న్యూస్‌టుడే: మానకొండూర్‌ ఎమ్మెల్యేగా ఉండి డాక్టరేట్‌ సాధించానని, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుల కన్నా పెద్ద చదువు తనదేనని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్‌, ధర్మారం గ్రామాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఎమ్మెల్యే మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆలోచన విధానంతోనే తాను ఎంఏ, ఎంఫిల్‌, బీఎడ్‌ చదివి ఉపాధ్యాయ వృత్తి చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచ్చానని అన్నారు. రెండోసారి ఎమ్మెల్యే గెలిచాక డాక్టరేట్‌ పట్టా కోసం శ్రమించానని తెలిపారు. అంబేడ్కర్‌ అణగారిన, బడుగు, బలహీన వర్గాల కోసం ఆలోచించి రాజ్యాంగం రూపొందించారన్నారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని