కాంగ్రెస్‌తో దూరం పాటిద్దాం: టీఎంసీ

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సభా సమన్వయం విషయంలో కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయించింది.

Published : 07 Dec 2022 05:11 IST

దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సభా సమన్వయం విషయంలో కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని టీఎంసీ నిర్ణయించింది. జాతీయ, రాష్ట్ర అంశాల విషయంలో భాజపాపై దాడి చేయాలని, అయితే కాంగ్రెస్‌తో మాత్రం కలవకూడదని నిర్ణయించినట్లు సమాచారం. పార్లమెంటులో సంఖ్యాపరంగా నాలుగో స్థానంలో టీఎంసీ ఉంది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న బిల్లులు...

శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలచిన వాటిల్లో  జీవ వైవిధ్య(సవరణ)బిల్లు, అటవీ సంరక్షణ(సవరణ)బిల్లు, బహుళ రాష్ట్రాల సహకార సంఘాల(సవరణ) బిల్లు, నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌ బిల్లు, నేషనల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్‌ బిల్లు, కంటోన్మెంట్‌ బిల్లు, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ బిల్లు తదితరాలు ఉన్నాయి. వీటిలో జీవ వైవిధ్య, బహుళ రాష్ట్రాల సహకార సంఘాలు, అటవీ సంరక్షణ చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.

చర్చకు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్న అంశాలివే..

శీతాకాల సమావేశాల్లో 16 అంశాలపై చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. 1. దేశ అంతర్గత భద్రతకు విదేశీ ముప్పు, చైనా చొరబాట్లు, విదేశాంగ విధానం. 2.ఎయిమ్స్‌ పోర్టల్‌పై సైబర్‌దాడి, లక్షల మంది ఆరోగ్య డేటా తస్కరణ 3. అదుపు తప్పిన ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న నిత్యావసర ధరలు 4.నిరుద్యోగం 5. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం 6.అటవీ హక్కు, సమాచార హక్కు, గ్రామీణ ఉపాధి హామీ పథకాల అమలు తీరు 7.సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తులను నియమించకుండా న్యాయవ్యవస్థపై దాడి చేయడం 8. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 9. స్వతంత్ర సంస్థల విధ్వంసం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం 10.గుజరాత్‌లోని మోర్బీ వంతెన ప్రమాదం 11.రూపాయి విలువ పతనం, ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరగడం 12. దేశవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం 13.మహిళలు, అణగారిన వర్గాలపై దాడులు అధికమవడం 14.పౌష్టికాహార లోపం పెరిగిపోవడం 15. కర్ణాటకలో ఓటర్ల డేటా చౌర్యం, లక్షల మంది పేర్ల తొలగింపు 16.జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న సమస్యలు, కశ్మీరీ పండిట్‌లపై పెరిగిపోతున్న నేరాలు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు