రాజస్థాన్‌లో జోడో యాత్ర సందడి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రకు రాజస్థాన్‌లో ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

Published : 07 Dec 2022 05:30 IST

భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు

ఝాలావాఢ్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రకు రాజస్థాన్‌లో ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. మంగళవారం ఉదయం ఖేల్‌ సంకుల్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఝాలావాఢ్‌ నగరం మీదుగా దేవడిఘటాకు, మధ్యాహ్నం 3.30 గం.లకు అక్కడి నుంచి సుకేత్‌ పట్టణం మీదుగా రాత్రికి కోటా జిల్లాలోని మోరు కలాన్‌ ఖేల్‌ మైదాన్‌కు చేరుకుంది. జాతీయ రహదారి-52 మీదుగా పాదయాత్ర ముందుకు వెళ్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వచ్చారు. ఝాలావాఢ్‌లో యాత్రను తిలకించేందుకు ప్రజలు సమీప భవనాలపైకి ఎక్కారు. స్థానిక భాజపా కార్యాలయంపై నిలుచున్న వారికి కూడా రాహుల్‌ గాంధీ చేతులు ఊపుతూ అభివాదాలు తెలిపారు అభిమానులకు గాలిలో ముద్దులు (ఫ్లైయింగ్‌ కిసెస్‌) విసురుతూ ముందుకు సాగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ డోటాస్ర, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు...రాహుల్‌ గాంధీ వెంట పాదయాత్రలో నడిచారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రను ప్రారంభించి మంగళవారంతో 90 రోజులు పూర్తయ్యింది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని