షర్మిల ఎవరు వదిలిన బాణమో అర్థమైంది: వీహెచ్‌

వైతెపా అధ్యక్షురాలు షర్మిల మీద తెరాస దౌర్జన్యం చేస్తే ప్రధానమంత్రి మోదీ పరామర్శించారని వస్తున్న వార్తల్నిబట్టి ఆమె ఎవరు వదిలిన బాణమో తెలిసిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు.

Published : 08 Dec 2022 05:36 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: వైతెపా అధ్యక్షురాలు షర్మిల మీద తెరాస దౌర్జన్యం చేస్తే ప్రధానమంత్రి మోదీ పరామర్శించారని వస్తున్న వార్తల్నిబట్టి ఆమె ఎవరు వదిలిన బాణమో తెలిసిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరణి అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ చర్చకు తీసుకువస్తుందని తెలిపారు.

ఎన్నికల కోసం కేసీఆర్‌ కొత్త నాటకం: పొన్నాల లక్ష్మయ్య

ఎన్నికలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త నాటకం మొదలుపెట్టారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకుండా ఖాళీ స్థలం ఉన్నవారికి డబ్బులిస్తాం అనడం, సింగరేణిలో కొత్త యూనిట్‌... ఇవన్నీ మోసమేనన్నారు. పరిశ్రమల కంటే వ్యవసాయ రంగానికే కరెంటు ఛార్జీలు ఎక్కువ అని పొన్నాల తెలిపారు. హైదరాబాద్‌ పాతబస్తీకి మెట్రోను 3 సంవత్సరాలు ఆపడం వల్ల రూ.4వేల కోట్లు అధిక భారం పడిందన్నారు.

సోనియా జన్మదినం సందర్భంగా 9న రక్తదాన శిబిరం

సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబరు 9న పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమానికి కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని