వారాహి వాహనంపై విమర్శలు తగవు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టుతో మొట్టికాయలు తిన్న వైకాపా.. జనసేన పార్టీ వారాహి వాహనం రంగుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

Published : 09 Dec 2022 03:31 IST

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టుతో మొట్టికాయలు తిన్న వైకాపా.. జనసేన పార్టీ వారాహి వాహనం రంగుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఏ రంగు వేశారో చూడకుండా రవాణాశాఖ ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను శుక్రవారం ప్రకటిస్తామన్నారు. పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ బస్సులు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. 14 ఎకరాలు కాజేసిన వ్యక్తిని ప్రశ్నించిన అనంతపురం జన సైనికుడు సురేష్‌పై దాడికి పాల్పడ్డారని ఆగ్రహించారు. అన్నమయ్య ప్రాజెక్టు పరిధిలో జనసేన పార్టీ పర్యటన ఉందని తెలియడంతో వెంటనే ఖాతాల్లో డబ్బు వేశారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని