Perni Nani: పవన్‌ వాహనానికి నిషేధిత రంగు: మాజీ మంత్రి పేర్ని నాని

‘వారాహితో యుద్ధానికి సిద్ధం అంటూ పవన్‌ కల్యాణ్‌ తీసుకొచ్చిన వాహనానికి నిషేధిత రంగు వేశారు’ అని రవాణా శాఖ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

Updated : 09 Dec 2022 09:41 IST

ఈనాడు, అమరావతి: ‘వారాహితో యుద్ధానికి సిద్ధం అంటూ పవన్‌ కల్యాణ్‌ తీసుకొచ్చిన వాహనానికి నిషేధిత రంగు వేశారు’ అని రవాణా శాఖ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. గురువారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు.‘మిలటరీ వాహనాలకు వాడే ఆలివ్‌ గ్రీన్‌ రంగును ప్రైవేటు వాహనాలకు వినియోగించడం నిషిద్ధమని చట్టం స్పష్టంగా చెబుతోంది. అదే రంగు ఉంటే రిజిస్ట్రేషన్‌ అవ్వదు. మీరు ఎటూ రంగు మార్చాలి కదా... అదేదో పసుపు రంగు వేసుకుంటే సరిపోతుంది. మీరు తెదేపాతో కలిసి వెళ్లేవారే కదా? ఇప్పుడేదో ప్రధాని మోదీ చెప్పడంతో నాలుగు రోజులు ఆగారు కదా. వ్యాన్లతో ఎన్నికల యుద్ధం అయిపోతుందనుకుంటే ప్రతి ఒక్కరూ వాటినే కొనేస్తారు. నేనూ కొనలేనా? ఇలాంటివి సినిమాల్లో అయితే బాగుంటాయి’ అని ఎద్దేవా చేశారు. ‘ఏపీ ప్రభుత్వం రక్షణ కల్పించకుండానే పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రానికి వచ్చి, వైకాపాలోని కాపు నాయకులను తిడుతూ వెళ్లిపోతున్నారా? ఆయనకు రక్షణ లేనిది ఎక్కడ?’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్ని నాని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని