విభజన అంశం ముగిసిందని రూ.లక్షల కోట్ల ఆస్తులు వదులుకుంటారా?: కళా వెంకట్రావు

రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.లక్ష కోట్ల ఆస్తులకు సంబంధించిన అంశం న్యాయస్థానంలో పెండింగ్‌ ఉండగా, విభజన అంశం ముగిసిందని సుప్రీంకోర్టులో ఏ విధంగా అఫిడవిట్‌ సమర్పిస్తారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు ప్రశ్నించారు.

Published : 09 Dec 2022 03:31 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి:  రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.లక్ష కోట్ల ఆస్తులకు సంబంధించిన అంశం న్యాయస్థానంలో పెండింగ్‌ ఉండగా, విభజన అంశం ముగిసిందని సుప్రీంకోర్టులో ఏ విధంగా అఫిడవిట్‌ సమర్పిస్తారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ అనాలోచిత చర్యతో రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. విభజనకు సంబంధించి సుప్రీంకోర్టులో వైకాపా ప్రభుత్వ అఫిడవిట్‌తో మరోమారు రాష్ట్రానికి తీరని ద్రోహం జరిగిందని గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘రాష్ట్రంలోని ప్రజాసమస్యలను పక్కదారి పట్టించడానికి వైకాపా నేతలు కొత్త నాటకానికి తెరలేపారు. నాడు తనపై ఉన్న కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా విభజనకు సహకరించిన జగన్‌రెడ్డి ఇప్పుడు కలిసి ఉండటమే తమ విధానమని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. కర్నూలులో హైకోర్టు అంటూ ఆ ప్రాంత ప్రజలను నమ్మిస్తూ.. సుప్రీంకోర్టులో మాత్రం అమరావతిలోనే హైకోర్టు అంటూ ప్రభుత్వ న్యాయవాదితో చెప్పించిన మాటవాస్తవం కాదా? పూటకో మాట.. ప్రాంతానికో ఎజెండా వైకాపా నైజం’ అని కళా వెంకట్రావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు