కాంగ్రెస్‌, భాజపాలే జాతీయ పార్టీలు: జగ్గారెడ్డి

దేశంలో జాతీయ పార్టీలంటే కాంగ్రెస్‌, భాజపాలేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను గురువారం ఆయన కలిశారు.

Published : 09 Dec 2022 05:14 IST

ఈనాడు, దిల్లీ: దేశంలో జాతీయ పార్టీలంటే కాంగ్రెస్‌, భాజపాలేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను గురువారం ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెరాస భారాసగా మారడంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా అనుమతిస్తారని తెలిపారు. మమతా బెనర్జీ, చంద్రబాబు వంటి నేతలే జాతీయ పార్టీలు పెట్టి విజయం సాధించలేకపోయారన్నారు. హైదరాబాద్‌ దాటని ఎంఐఎం కూడా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నష్టపోవడానికి ఎంఐఎం, ఇతర చిన్న పార్టీలే కారణమన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంపై అందర్నీ కలుపుకొని వెళ్లాలని ఖర్గేకు చెప్పానన్నారు. రాష్ట్ర నాయకత్వంపై తనకు ఎటువంటి ఫిర్యాదులు లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ లేదనిపించేందుకే తెరాస, భాజపా కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని