హైదరాబాద్‌లో భాజపా దక్షిణాది రాష్ట్రాల విస్తారక్‌ల సమావేశం

దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్‌ విస్తారక్‌ (పూర్తి సమయ కార్యకర్తలు)లతో భాజపా హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనుంది.

Published : 09 Dec 2022 05:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్‌ విస్తారక్‌ (పూర్తి సమయ కార్యకర్తలు)లతో భాజపా హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజులపాటు వారికి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. దీనికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు హాజరై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 114 లోక్‌సభ స్థానాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. అందులో దక్షిణాది రాష్ట్రాలవే ఎక్కువగా ఉన్నాయి. పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా ప్రతి లోక్‌సభ స్థానానికి ఒక విస్తారక్‌ను భాజపా నియమించింది.


మైనార్టీ మోర్చా తెలంగాణ ఇన్‌ఛార్జిగా షబానా

విజయవాడ, న్యూస్‌టుడే: భాజపా మైనార్టీ మోర్చా తెలంగాణ ఇన్‌ఛార్జిగా షబానాను నియమిస్తున్నట్లు మోర్చా జాతీయ అధ్యక్షుడు జనాబ్‌ జమాల్‌ సిద్ధిఖీ ప్రకటించారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శిక్షణ తరగతుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన ఆమె మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు