Komatireddy: ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా: ఎంపీ కోమటిరెడ్డి
తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దర్శించుకున్నారు.
తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మాట్లాడుతూ.. ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా లాంటి మహమ్మారుల నుంచి ప్రజలను రక్షించాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కోమటిరెడ్డి చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, నెల రోజుల ముందుగా మద్దతుదారులతో చర్చించి తెలంగాణ ప్రజలకు ఏవిధంగా మంచి చేయాలి అనే దానిపై ముందుకు వెళతా అని తెలిపారు. తెలంగాణలో షర్మిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని ఎంపీ అభిప్రాయపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Britain: లండన్ నగరంలో ఇంటి అద్దె.. నెలకు రూ.3 లక్షలట..!
-
Crime News
Crime News: పోలీసులుగా నటించి.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
-
Sports News
IND vs PAK: ఆసియా కప్ 2023.. గందరగోళానికి తెరపడాలంటే అదే సరైన విధానం: అక్రమ్
-
World News
USA: కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు.. ముగ్గురి మృతి!
-
Movies News
Ram Charan: నాన్న మౌనం వీడితే ఏమవుతుందో తెలీదు: హీరో రామ్చరణ్
-
General News
TTD: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు .. భారీగా తరలివచ్చిన భక్తులు