ఆప్‌నకు దిల్లీలో కార్యాలయ స్థలం

ఆమ్‌ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటిస్తే.. ఆ పార్టీకి దేశ రాజధానిలోని ముఖ్యమైన ప్రాంతంలో కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయిస్తారు.

Published : 09 Dec 2022 05:32 IST

జాతీయ హోదాతో దక్కిన అవకాశం

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటిస్తే.. ఆ పార్టీకి దేశ రాజధానిలోని ముఖ్యమైన ప్రాంతంలో కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయిస్తారు. ఇందుకు ఆప్‌ అర్హత సాధించినట్లయింది. నగరంలో పాలక పార్టీ కావడంతో ఇప్పటికే దిల్లీ ప్రభుత్వం ఆ పార్టీకి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లో ఒక కార్యాలయం ఉంది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కేజ్రీవాల్‌కు ప్రభుత్వ నివాసం కూడా దక్కుతుంది. ఒకవేళ ఇప్పటికే ప్రభుత్వ నివాసం ఉంటే మాత్రం మరోటి ఇవ్వరు. కేజ్రీవాల్‌ ప్రస్తుతం దిల్లీ ముఖ్యమంత్రి హోదాలో విలాసవంతమైన సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలోని ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్డులో అధికారిక బంగ్లాలో ఉంటున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని