ఏపీని కావాలనుకుంటే తమిళనాడులో కలపండి..

మెట్రో కడతామని 2013లో హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత శంకుస్థాపన చేశారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు.

Updated : 10 Dec 2022 07:05 IST

భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌

ఈనాడు, దిల్లీ: మెట్రో కడతామని 2013లో హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత శంకుస్థాపన చేశారని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు. తెలంగాణపై సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు సరికాదని, జగన్‌ తన సలహాదారును మార్చుకోవాలని సూచించారు. మద్రాస్‌ ప్రావిన్స్‌ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినందున కావాలంటే ఏపీని తమిళనాడులో కలుపుకోవాలన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ 24 దేశాలకు వ్యాక్సిన్‌ పంపితే కేసీఆర్‌ అవినీతి సొమ్ము విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని