Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం తనయుడికి మంత్రి పదవి

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు ఉదయనిధికి రాష్ట్ర మంత్రిపదవి ఖాయమైంది.

Updated : 13 Dec 2022 08:00 IST

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనయుడు ఉదయనిధికి రాష్ట్ర మంత్రిపదవి ఖాయమైంది. బుధవారం ఉదయం 9.20 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న స్టాలిన్‌ ప్రతిపాదనను గవర్నర్‌ ఆమోదించినట్టు రాజ్‌భవన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. 2021 శాసనసభ ఎన్నికల్లో చెన్నైలోని చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా ఉదయనిధి తొలిసారిగా గెలిచారు. ‘వారసత్వ రాజకీయాలు తగవు’ అంటూ చర్చ సాగడంతో అప్పట్లో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. తాజాగా ఆయనకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖను కేటాయించనున్నట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని