దిల్లీలో దీక్షకు సిద్ధమేనా?

ఐటీఐఆర్‌, రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు కోరుతూ 8న దిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేద్దాం..

Published : 08 Mar 2021 04:27 IST

కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఐటీఐఆర్‌, రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలు కోరుతూ 8న దిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేద్దాం.. మీరు సిద్ధమేనా? అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఆయన కేటీఆర్‌కు ఆదివారం లేఖ రాశారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా మీ ప్రకటనలు, హడావుడి చూస్తుంటే నవ్వొస్తోంది. మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని, ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ ఇవ్వలేదని మీరంటున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చలేదని శివాలెత్తుతున్నారు. ఐటీఐఆర్‌ అటకెక్కించారని ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు... భాజపాపై ఇక యుద్ధమే అంటున్న మీ తీరు హాస్యాస్పదంగా వుంది’ అన్నారు. సీఎం కేసీఆర్‌ కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇలాగే మోదీ సర్కారుపై విరుచుకుపడి, ఫలితాలు వచ్చాక వెనక్కి తగ్గిన దృశ్యం ప్రజల కళ్ల ముందు మెదులుతూనే ఉందని రేవంత్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని