Updated : 22/08/2021 05:02 IST

రాహుల్‌తో ఎవరికీ ఉపయోగం లేదు: ధన్వే

ముంబయి: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగమూ లేదంటూ కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రావుసాహెబ్‌ ధన్వే విమర్శించారు. ఈ సందర్భంగా అభ్యంతరకరమైన మాటను ఉపయోగించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కరాడ్‌ మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో చేపట్టిన జన్‌ ఆశీర్వాద్‌ యాత్రలో పాల్గొన్న ధన్వే ఈ వ్యాఖ్య చేశారు. ‘‘ఆయన తిరుగుతూనే ఉంటారు. ఉపయోగపడే పనులేవీ చేయరు. నేను లోక్‌సభలో 20 ఏళ్లుగా ఉన్నాను. ఆయన పనితీరు ఏమిటో చూస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న గొప్ప పనులను అందరూ గమనించాలి’’ అని చెప్పారు. ధన్వే వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే తీవ్రంగా ఖండించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని