దొడ్డురకం వడ్లు కేంద్రం కొనాలి.. ఆ తర్వాతే ఓట్లు అడగాలి హరీశ్‌రావు

భాజపా వాళ్లకు రైతులపై ప్రేమ ఉంటే దొడ్డు వడ్లు కొంటామని చెప్పిన తర్వాతే హుజూరాబాద్‌ ప్రజలను ఓట్లడగాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే వ్యవసాయ చట్టాలతో రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిన భాజపా ప్రభుత్వం తాజా నిర్ణయంతో

Updated : 12 Sep 2021 06:07 IST

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: భాజపా వాళ్లకు రైతులపై ప్రేమ ఉంటే దొడ్డు వడ్లు కొంటామని చెప్పిన తర్వాతే హుజూరాబాద్‌ ప్రజలను ఓట్లడగాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే వ్యవసాయ చట్టాలతో రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిన భాజపా ప్రభుత్వం తాజా నిర్ణయంతో వారిని తీవ్ర అయోమయంలో పడేసిందన్నారు. హుజూరాబాద్‌లో ఆటోనగర్‌కు శనివారం భూమిపూజ చేసిన అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధికశాతం మంది రైతులు దొడ్డువడ్లు పండిస్తున్నారని... ఉన్నట్టుండి వాటిని కొనబోమని కేంద్రం ప్రకటించడంతో అన్నదాతలు నష్టపోతారన్నారు. ఇప్పటికే గోదాములన్నీ నిండిపోయాయని..రైతులు పండించిన దొడ్డు వడ్లన్నీ ఎక్కడికిపోవాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు 1.30 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలిచ్చిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని