Published : 12 Oct 2021 04:43 IST

భాజపాను ఓడిస్తేనే ధరల తగ్గుముఖం

సిద్దిపేట తరహాలో హుజూరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం
ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

ఎల్కతుర్తి, న్యూస్‌టుడే: ‘భాజపా ప్రభుత్వంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆ పార్టీని ఓడిస్తే ధరలు దిగివస్తాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే సిద్దిపేట తరహాలో హుజూరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట్‌లో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్‌, ఇల్లందకుంట మండలాల నుంచి మున్నూరు కాపులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు గజమాలతో సన్మానించారు. మున్నూరుకాపు సామాజికవర్గానికి తెరాస హయాంలోనే గుర్తింపు లభించిందని పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల మంతి మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మున్నూరుకాపు కార్పొరేషన్‌ ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. తెరాస వల్లనే రాష్ట్రంలో పది మంది మున్నూరుకాపు సామాజికవర్గీయులు ఎమ్మెల్యేలుగా గెలిచారన్నారు. హుజూరాబాద్‌ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, నన్నపనేని నరేందర్‌, జోగు రామన్న, సురేందర్‌, దానం నాగేందర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు వద్దిరాజు రవీచంద్ర, జడ్పీ ఛైర్మన్‌ సుధీర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని