పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేయాలి: కోదండరాం

రాష్ట్రంలో పది రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని.. తరుగు, నాణ్యత పేరిట మిల్లర్లు చేస్తున్న దోపిడీని అరికట్టాలని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. ‘రైతు రక్షణ యాత్ర’లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట

Updated : 28 Nov 2021 05:07 IST

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పది రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని.. తరుగు, నాణ్యత పేరిట మిల్లర్లు చేస్తున్న దోపిడీని అరికట్టాలని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. ‘రైతు రక్షణ యాత్ర’లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పాపూర్‌లలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం సందర్శించారు. మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గం సహా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాతలు తిప్పలు పడుతున్నారన్నారు. యాసంగిలో వరి సాగుపై కేంద్రంతో తేల్చుకొస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దిల్లీకి వెళ్లివచ్చి ఫాంహౌస్‌లో కూర్చున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని