
‘అప్పు తీసుకునైనా ధాన్యం కొనాలి’
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రం నుంచి ఎంత మోతాదులో వడ్లు కొనుగోలు చేస్తామో కేంద్రం చెప్పకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి శనివారం విమర్శించారు. తెరాస ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన కోరారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 29న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేయాలని సీపీఎం న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.