Published : 29/11/2021 03:41 IST

అన్నదాతలను యాచకులుగా మార్చిన ప్రభుత్వం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

వనపర్తి, న్యూస్‌టుడే: అన్నం పెట్టే అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం యాచకులుగా మార్చిందని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేది బీఎస్పీనే అని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫులేె వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా బడుగు, బలహీనవర్గాల ప్రగతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గడీల పాలనను అంతమొందించి.. బహుజనులకు అధికారం, ముస్లిం మైనార్టీలు, క్రైస్తవులకు బతుకును ఇచ్చే సత్తా బీఎస్పీకే ఉందన్నారు. వనపర్తి జిల్లాలో వైద్య కళాశాల కోసం అధికారులు ఎస్టీ, ఎస్సీల భూములను లాక్కున్నారని ఆరోపించారు. పభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం బడాబాబుల కోసమేనని, దళితబంధు పథకం ఓ మాయ అని దుయ్యబట్టారు. సభకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ అధ్యక్షత వహించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని