ఎన్డీయే అంటే లెక్కలుండని ప్రభుత్వం

భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీయే అంటే లెక్కల సమాచారం ఉండని (నో డాటా అవైలబుల్‌) ప్రభుత్వం అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీరామారావు బుధవారం ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం వద్ద

Updated : 02 Dec 2021 16:26 IST

ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీయే అంటే లెక్కల సమాచారం ఉండని (నో డాటా అవైలబుల్‌) ప్రభుత్వం అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీరామారావు బుధవారం ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం వద్ద చనిపోయిన ఆరోగ్య కార్యకర్తల లెక్కలుండవు. కరోనా వల్ల మూతపడ్డ పరిశ్రమల లెక్కలుండవు. వలస కూలీల మరణాల సమాచారం ఉండదు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారి గణాంకాలు ఉండవు. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ లబ్ధిదారుల వివరాలు, రైతు ఆందోళనల్లో మృతి చెందిన అన్నదాతల మరణాలపై లెక్కలు ఉండవు’’ అని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్‌కు కొన్ని జాతీయ మీడియా క్లిప్పులతో పాటు లోక్‌సభలో ప్రశ్నోత్తరాలకు సంబంధించిన నోట్‌ను ట్యాగ్‌ చేశారు.

అంబులెన్స్‌ వితరణ: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చారు. దీనిని బుధవారం జెండా ఊపి కేటీఆర్‌  ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఉప్పల ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని