పొరుగు రాష్ట్రం ఎంపీల్లా వైకాపా సభ్యులు పోరాడలేరా?

ప్రత్యేక హోదా.. విశాఖ రైల్వే జోన్‌, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి హామీలపై వైకాపా ఎంపీలు పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించడం లేదని తెదేపా లోక్‌సభాపక్షనేత కె.రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యుడు రవీంద్రకుమార్‌తో

Published : 03 Dec 2021 04:23 IST

తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ఈనాడు, దిల్లీ: ప్రత్యేక హోదా.. విశాఖ రైల్వే జోన్‌, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి హామీలపై వైకాపా ఎంపీలు పార్లమెంటులో ఎందుకు ప్రశ్నించడం లేదని తెదేపా లోక్‌సభాపక్షనేత కె.రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యుడు రవీంద్రకుమార్‌తో కలిసి దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ‘22 మంది లోక్‌సభ, ఆరుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉన్నా... పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదు? పొరుగు రాష్ట్రం తెలంగాణ ఎంపీలు ధాన్యం సమస్యపై వెల్‌లోకి వెళ్లి బైఠాయిస్తుంటే వైకాపా ఎంపీలకు ఎందుకు దమ్ము సరిపోవడం లేదు? ప్రత్యేక హోదా ముగిసిన అంశమని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మరో ఆలోచన లేదని కేంద్రం లిఖితపూర్వకంగా చెప్పినా ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు’ అని ఆయన నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని