Published : 04 Dec 2021 05:23 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలు

జగ్గారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెరాస ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వారి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రజాప్రతినిధులను ప్రలోభపెడుతున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్‌కు తెరాస ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌ శుక్రవారం బుద్ధభవన్‌లో సీఈవోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే నజరానా అంటూ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జగ్గారెడ్డి ఫోన్లు చేశారని ఆరోపించారు. పోలింగుకు ముందు రూ.50వేలు, తర్వాత రెండు లక్షలు ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని వారు కోరారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని