
ధాన్యం కొనకుంటే రైతులు భరతం పడతారు: తెదేపా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, వరిధాన్యాన్ని కొనకుంటే భాజపా, తెరాసల భరతం పడతారని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై రాజకీయ లబ్ధిపొందాలని భాజపా, తెరాసలు నాటకం అడుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు మరణిస్తున్నా పాలకుల్లో చలనం లేదని ధ్వజమెత్తారు. యాసంగిలో వరి సాగుచేస్తే ఆ ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వమే కొనాలని తెదేపా డిమాండు చేస్తోందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.