ప్రజాస్వామ్యం దిశగా రాజకీయాలు

దేశంలో పరిస్థితులు కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం దిశగా పయనిస్తున్నాయని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. ఓ వైపు కొన్ని పార్టీలు వారసత్వ రాజకీయాలకు ప్రయత్నిస్తుంటే.....

Published : 07 Dec 2021 04:45 IST

కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ

భాజపాలో చేరిన టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్‌


విఠల్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌. చిత్రంలో ఎంపీలు అర్వింద్‌, బండి సంజయ్‌, కేంద్ర మంత్రి నఖ్వీ

ఈనాడు, దిల్లీ: దేశంలో పరిస్థితులు కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం దిశగా పయనిస్తున్నాయని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. ఓ వైపు కొన్ని పార్టీలు వారసత్వ రాజకీయాలకు ప్రయత్నిస్తుంటే భాజపా మాత్రం ప్రజాస్వామ్య విస్తరణ, రక్షణకు పోరాడుతోందని తెలిపారు. దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ల సమక్షంలో టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు విఠల్‌ సోమవారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా  బండి సంజయ్‌ మాట్లాడుతూ.. నిజమైన ఉద్యమకారులకు భాజపా వేదికైందన్నారు. విఠల్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారెవరికీ తెరాస ప్రభుత్వ హయాంలో గౌరవం దక్కడం లేదని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు