ప్రజారోగ్యంపై సీఎంకు చిత్తశుద్ధి లేదు: డీకే అరుణ

రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం నిర్వహించిన

Published : 15 Jan 2022 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రజల ఆరోగ్యం, వారి ఆర్థిక పరిస్థితులపై ఎలాంటి భారం పడకుండా చూడాలని ముఖ్యమంత్రులకు ప్రధాని చేసిన సూచనల గురించి కనీసం తెలుసుకోవాలన్న ఆలోచన కూడా రాష్ట్ర సీఎంకు లేదని మండిపడ్డారు. ప్రజల కోసం దేశ ప్రధాని తన సమయాన్ని కేటాయిస్తే.. కేసీఆర్‌ మాత్రం తీరిక లేకుండా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేంద్రంపై బురద జల్లుతున్న ముఖ్యమంత్రి వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని