ఎస్పీ గూటికి స్వామిప్రసాద్‌ మౌర్య

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఉత్తర్‌ ప్రదేశ్‌లో మంత్రి పదవికి, భాజపా సభ్యత్వానికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్‌ మౌర్య ఊహించినట్లుగానే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీర్థం పుచ్చుకున్నారు. మరో తిరుగుబాటు మంత్రి

Updated : 15 Jan 2022 06:04 IST

మరో తాజా మాజీ మంత్రి ధరమ్‌సింగ్‌ కూడా..

లఖ్‌నవూ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఉత్తర్‌ ప్రదేశ్‌లో మంత్రి పదవికి, భాజపా సభ్యత్వానికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్‌ మౌర్య ఊహించినట్లుగానే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీర్థం పుచ్చుకున్నారు. మరో తిరుగుబాటు మంత్రి ధరమ్‌సింగ్‌ సైనీతో కలసి శుక్రవారం ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. స్వామిప్రసాద్‌.. ఓబీసీ సామాజిక వర్గంపై గట్టి పట్టున్న నేత. ఆయన చేరికతో రాష్ట్రవ్యాప్తంగా యాదవేతర ఓబీసీల్లో ఎస్పీ బలం పెరిగే అవకాశముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు- కమలదళం నుంచి ఇటీవల బయటికొచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు- భగవతి సాగర్‌, రోషన్‌లాల్‌ వర్మ, వినయ్‌ శక్య, బ్రిజేష్‌ ప్రజాపతి, ముకేశ్‌ వర్మ, అప్నాదళ్‌ పార్టీ శాసనసభ్యుడు అమర్‌సింగ్‌ చౌధరీ కూడా అఖిలేశ్‌ సమక్షంలో తాజాగా సమాజ్‌వాదీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్దకు జనం పెద్దఎత్తున తరలిరావడంతో.. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన పేరిట కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని