మంత్రి కన్వెన్షన్‌ సెంటర్లో జూద క్రీడలా?

మంత్రి కొడాలి నాని పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా గుడివాడలో క్యాసినో ఏర్పాటుచేసి రాష్ట్రం పరువు గంగలో కలిపారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మంత్రికి చెందిన కే కన్వెన్షన్‌ సెంటర్‌

Published : 18 Jan 2022 03:56 IST

ఏపీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు

చంద్రబాబు అధ్యక్షతన పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో నేతల మండిపాటు

ఈనాడు, అమరావతి: మంత్రి కొడాలి నాని పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా గుడివాడలో క్యాసినో ఏర్పాటుచేసి రాష్ట్రం పరువు గంగలో కలిపారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మంత్రికి చెందిన కే కన్వెన్షన్‌ సెంటర్‌ కోడి పందేలు, గుండాట, పేకాట, రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించారని మండిపడ్డారు. సంక్రాంతి సంబరాల ముసుగులో జూద క్రీడలు యథేచ్ఛగా సాగుతుంటే... ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఆన్‌లైన్‌లో జరిగిన పార్టీ వ్యూహకమిటీ సమావేశంలో ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పండగ వేళ తన కనుసన్నల్లో మహిళల చేత రికార్డింగ్‌ డ్యాన్సులు చేయించిన మంత్రిపై, పోలీసు అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండు చేశారు. తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో పండ్లు పంచడం, రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాల్ని నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. పార్టీ ప్రారంభించిన చైతన్యరథం ఇ-పేపర్‌ను చివరి స్థాయి కార్యకర్త వరకూ ఇ-పేపర్‌ను తీసుకెళ్లాలని తీర్మానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని