ఆ నియామకాలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఆల్‌ ఇండియా పోలింగ్‌ బూత్‌ కాంగ్రెస్‌ పేరుతో తమ పార్టీని పోలిన విధంగా పార్టీ జెండా, లెటర్‌ హెడ్స్‌తో కొంత మంది తెలంగాణలో జరుపుతున్న నియామకాలకు.. కాంగ్రెస్‌కు

Published : 18 Jan 2022 03:56 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఆల్‌ ఇండియా పోలింగ్‌ బూత్‌ కాంగ్రెస్‌ పేరుతో తమ పార్టీని పోలిన విధంగా పార్టీ జెండా, లెటర్‌ హెడ్స్‌తో కొంత మంది తెలంగాణలో జరుపుతున్న నియామకాలకు.. కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కొంత మంది పార్టీ నాయకులకు నియామక పత్రాలు ఇస్తూ మోసం చేస్తున్నారని, అలాంటి వారిని కాంగ్రెస్‌ ప్రతినిధులుగా భావించవద్దన్నారు.

* కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర అక్రమాలపై ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని