ఆప్‌ పంజాబ్‌ సీఎం అభ్యర్థిగా భగవంత్‌ మాన్‌

పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్‌ మాన్‌ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం ప్రకటించారు. సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలో చెప్పాలంటూ తాము నిర్వహించిన ఫోన్‌ సర్వేలో 21,59,437 మంది స్పందించారని

Published : 19 Jan 2022 03:26 IST

అరవింద్‌ కేజ్రీవాల్‌తో భగవంత్‌ మాన్‌

చండీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్‌ మాన్‌ పేరు ఖరారైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం ప్రకటించారు. సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలో చెప్పాలంటూ తాము నిర్వహించిన ఫోన్‌ సర్వేలో 21,59,437 మంది స్పందించారని, వీరిలో 93.3% మంది భగవంత్‌ మాన్‌ పేరు సూచించారని తెలిపారు. ప్రస్తుతం సంగ్రూర్‌ ఎంపీగా భగవంత్‌ మాన్‌ ఉన్నారు. తమ సర్వేలో 3.6% మంది రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పేరును సూచించారని కూడా కేజ్రీవాల్‌ వెల్లడించారు. పంజాబ్‌లోని 117 స్థానాలకు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని