CM KCR: కేసీఆర్‌ను ఎవరన్నా టచ్‌ చేయగలరా?: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా.. అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భాజపానుద్దేశించి అన్నారు. ఆయన్ను ముట్టుకునే దమ్ము, ధైర్యం దేశంలో ఎవరికీ

Updated : 20 Jan 2022 07:15 IST

చిన్నచింతకుంట, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా.. అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ భాజపానుద్దేశించి అన్నారు. ఆయన్ను ముట్టుకునే దమ్ము, ధైర్యం దేశంలో ఎవరికీ లేవన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంటలో రూ.41 కోట్లతో నిర్మించనున్న వారధితో కూడిన చెక్‌డ్యాం పనులకు బుధవారం భూమిపూజ చేసి మాట్లాడారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేసినందుకు, దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు పరుస్తునందుకు జైల్లో పెడతారా అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని