భాజపాలో చేరిన బిపిన్‌ రావత్‌ సోదరుడు విజయ్‌

విశ్రాంత సైన్యాధికారి విజయ్‌ రావత్‌ బుధవారం భాజపాలో చేరారు. ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌కు ఆయన సోదరుడు. యూపీ, ఉత్తరాఖండ్‌లలో బలాన్ని పెంచుకోవాలని

Updated : 20 Jan 2022 05:34 IST

దిల్లీ: విశ్రాంత సైన్యాధికారి విజయ్‌ రావత్‌ బుధవారం భాజపాలో చేరారు. ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌కు ఆయన సోదరుడు. యూపీ, ఉత్తరాఖండ్‌లలో బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న భాజపా.. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించింది. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ సమక్షంలో విజయ్‌ పార్టీ కండువా కప్పుకొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనా విధానం నచ్చి, కమలం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. రావత్‌ కుటుంబానికి ఉత్తరాఖండ్‌లో ఉన్న పేరు కారణంగా ఆయన సోదరుడు తమకు విజయావకాశాలను మెరుగుపరుస్తారని కమలనాథులు అంచనా వేస్తున్నారు. సైన్యంలో కర్నల్‌గా పదవీ విరమణ చేసిన విజయ్‌ రావత్‌.. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత నచ్చే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని