గోవా ఎన్నికల్లో ‘శివసేన-ఎన్సీపీ’ పొత్తు..

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేశాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్‌ అఘాడీలో భాగమైన ఇరుపార్టీలు..

Published : 20 Jan 2022 04:35 IST

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేశాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్‌ అఘాడీలో భాగమైన ఇరుపార్టీలు.. కాంగ్రెస్‌ లేకుండానే కూటమిగా ముందుకు వెళ్లటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పణజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. ఎన్సీపీ నేతలు ప్రఫుల్‌ పటేల్‌, జితేంద్ర అవ్హాద్‌, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌లు కూటమిపై ప్రకటన చేశారు  ‘‘మాతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్‌ దురదృష్టం. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-ఎన్సీపీ కూటమి బలాన్ని చూపిస్తాం’’ అని రౌత్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని