317 జీవోను కేంద్రం అపేయొచ్చుగా..

జీవో 317తో స్థానికులను స్థానికేతరులుగా మార్చి.. ఉద్యోగ, ఉపాధ్యాయ భార్యాభర్తలను బదిలీలతో విడదీసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందపడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రపతి ఉత్తర్వుల

Published : 20 Jan 2022 04:35 IST

 పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌లో చేరిన ఉపాధ్యాయ సంఘం నేత హర్షవర్ధన్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: జీవో 317తో స్థానికులను స్థానికేతరులుగా మార్చి.. ఉద్యోగ, ఉపాధ్యాయ భార్యాభర్తలను బదిలీలతో విడదీసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందపడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే ఈ జీవో తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క కలం పోటుతో దాన్ని ఆపేయొచ్చు. ఈ నాటకంలో పాత్రధారి తెరాస అయితే, సూత్రధారి భాజపా’’ అని ఆయన ఆరోపించారు. టీపీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. జీవో 317 కారణంగా టీచర్లు ప్రగతిభవన్‌ను ముట్టడిస్తున్నారని.. ఆ ఉత్తర్వు ఉద్యోగుల భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టేస్తోందని అన్నారు.

ఎక్కువ సభ్యత్వం చేయిస్తే రాహుల్‌తో సన్మానం

డిజిటల్‌ సభ్యత్వ నమోదులో దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండాలని రేవంత్‌రెడ్డి అన్నారు. డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై బుధవారం ఇందిరా భవన్‌లో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎక్కువ సభ్యత్వం చేయించిన వారికి రాహుల్‌గాంధీతో సన్మానం చేయిస్తానని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు