భాజపా.. వంచనకు మారు పేరు

భారతీయ జనతాపార్టీ వంచనకు మారుపేరని, ఎస్సీలను ఓటుబ్యాంకుగా వాడుకునేందుకు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని, వారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీ నేతలకు లేదని దళిత, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ

Published : 21 Jan 2022 04:55 IST

దళితులపై మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదు
మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి, న్యూస్‌టుడే: భారతీయ జనతాపార్టీ వంచనకు మారుపేరని, ఎస్సీలను ఓటుబ్యాంకుగా వాడుకునేందుకు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని, వారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆ పార్టీ నేతలకు లేదని దళిత, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎస్సీ నియోజకవర్గాల గురించి మాట్లాడే సమయంలో ఆయన పక్కన కనీసం ఆ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు లేకపోవడం విచారకరమన్నారు. ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి పేరిట ఆ పార్టీ కొత్త నాటకాలకు తెరతీసిందన్నారు. గురువారం ఆయన పెద్దపల్లిలో విలేకరులతో మాట్లాడారు. భాజపా అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా ఎస్సీలపై 45,961 కేసులు, ఎస్టీలపై 8,272 నమోదయ్యాయని చెప్పారు. ఎస్సీలపై గుజరాత్‌లో 15 వేలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 12,714, మధ్యప్రదేశ్‌లో అయిదువేలకు పైగా కేసులు పెట్టారన్నారు. ఇటీవలే ఉత్తర్‌ప్రదేశ్‌ ఒక ఎస్సీ బాలికను హతమార్చారన్నారు. తెలంగాణలో పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్‌ చనిపోవడానికి కారణం అందరికీ తెలుసన్నారు. భాజపా నిజస్వరూపాన్ని గుర్తించి ఎస్సీలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ పాలనలో ఎస్సీల సంక్షేమంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు