
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి
సీఎం కేసీఆర్కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి లేఖ
గాంధీభవన్, న్యూస్టుడే: రాష్ట్రంలో తెగుళ్లు, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. మిర్చికి ఎకరాకు రూ.50 వేలు, మిగతా పంటలకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలన్నారు. పలు ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బాధిత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. గతేడాది మిర్చికి ధర ఎక్కువ రావడంతో ఎకరాకు రూ.3.5 లక్షల ఆదాయం వస్తుందనే నమ్మకంతో రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారన్నారు. కానీ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తెగులు బారినపడి 70 శాతం వరకు పంట కోల్పోవడంతో పెట్టుబడి కూడా దక్కని దయనీయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.