‘ధరణి’ బాధితులకు అండగా కాంగ్రెస్‌

ధరణి బాధితులకు అండగా వారం రోజుల పాటు భూపరిరక్షణ ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. మండల కేంద్రాల్లో భూసమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించి కేంద్ర,...

Published : 23 Jan 2022 05:09 IST

వారం పాటు భూపరిరక్షణ ఉద్యమం చేపట్టాలని నిర్ణయం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ధరణి బాధితులకు అండగా వారం రోజుల పాటు భూపరిరక్షణ ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. మండల కేంద్రాల్లో భూసమస్యలు ఎదుర్కొంటున్న వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్య తీవ్రతను తీసుకెళ్లాలని.. అవసరమైతే ప్రధానిని, రాష్ట్రపతిని కలవాలని భావిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన పీసీసీ ధరణి కమిటీ శనివారం గాంధీభవన్‌లో సమావేశమైంది. శ్రీధర్‌బాబు, షబ్బీర్‌అలీ, మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎం.కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్‌, అద్దంకి దయాకర్‌, ప్రీతం, బెల్లయ్య నాయక్‌ పాల్గొన్నారు. ధరణి వెబ్సైట్‌లోని లోపాలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, పరిష్కార మార్గాలపై చర్చించారు. శ్రవణ్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల లక్షల మంది యజమానులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీ, ఎస్టీల ఎసైన్డ్‌ భూములను ధరణి పేరుతో ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని