ఓబీసీ నేతల వలసలు భాజపాపై ప్రభావం చూపవు

ఇటీవలి కాలంలో పలువురు ఓబీసీ మంత్రులు, శాసనసభ్యులు భాజపా నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రభావం పార్టీ విజయావకాశాలపై ఏమాత్రం కనిపించదని యూపీ ఉప ముఖ్యమంత్రి

Published : 24 Jan 2022 04:56 IST

యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య

లఖ్‌నవూ: ఇటీవలి కాలంలో పలువురు ఓబీసీ మంత్రులు, శాసనసభ్యులు భాజపా నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రభావం పార్టీ విజయావకాశాలపై ఏమాత్రం కనిపించదని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య ధీమా వ్యక్తంచేశారు. అన్నివర్గాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకం ఉందని చెప్పారు. మార్చి 10న ఫలితాలు వెలువడిన తర్వాత సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలెవరూ కనిపించరని ఆదివారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పారు. ‘‘పోలింగ్‌ బూత్‌ స్థాయి వరకు భాజపా బలంగా ఉంది. ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతల వెంట కార్యకర్తలెవరూ వెళ్లలేదు. భాజపా అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. అభివృద్ధి పనులు జరిగాయి. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చినా భాజపాయే బలంగా ఉంటుంది. యూపీలో నిరుడు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే రుజువైంది’’ అని మౌర్య వివరించారు. ఆలయాలను భాజపా ఎన్నడూ ఎన్నికలతో ముడిపెట్టదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని