త్వరలోనే మా మంత్రిని అరెస్టు చేస్తారు: కేజ్రీవాల్‌

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రయోగించేందుకు భాజపా సిద్ధమవుతోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మంత్రి సత్యేంద్ర  జైన్‌ను ఈడీ అధికారులు

Published : 24 Jan 2022 04:56 IST

దిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రయోగించేందుకు భాజపా సిద్ధమవుతోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మంత్రి సత్యేంద్ర  జైన్‌ను ఈడీ అధికారులు త్వరలో అరెస్ట్‌ చేస్తారనే సమాచారం ఉందని తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు జైన్‌ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారని, మళ్లీ వచ్చినా స్వాగతిస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత చెప్పారు. తనతో సహా ఆమ్‌ ఆద్మీ ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్‌ చేసినా తాము భయపడేది లేదన్నారు. ‘‘మేము చన్నీ(పంజాబ్‌ సీఎం) మాదిరి కన్నీరు కార్చం. ఆయన(చన్నీ)కి ఎందుకంత నైరాశ్యం? తప్పు చేశారు కాబట్టే. ఈడీ అధికారులు పెద్దపెద్ద నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి తప్పులు చేయలేదు కాబట్టి మేము భయపడం. అన్ని కేంద్ర సంస్థలను పంపాలని కేంద్రం, భాజపాలకు సూచిస్తున్నాను. మేమంతా సిద్ధంగానే ఉన్నాం. సత్యేంద్ర జైన్‌ మాత్రమే కాదు, మా ఇంటికి, మనీశ్‌ సిసోడియా, భగవంత్‌ మాన్‌ ఇంటికి పంపండి. మీ అందరికీ స్వాగతం’’ అని  కేజ్రీవాల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు