దేవుడిపై ఒట్టు.. పార్టీ మారబోం

పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన గత అనుభవాలు కాంగ్రెస్‌ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో

Published : 24 Jan 2022 04:56 IST

  గోవా నేతలతో ప్రమాణం చేయిస్తున్న కాంగ్రెస్‌

పణజీ: పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన గత అనుభవాలు కాంగ్రెస్‌ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోవా కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో బరిలో నిలవనున్న అభ్యర్థులతో ప్రమాణం చేయించింది. తాము గెలిస్తే పార్టీ మారబోమని ఈ మేరకు భగవంతునిపై ఒట్టు వేయించింది. మొత్తం 34 మంది అభ్యర్థులను ప్రత్యేక బస్సులో రాష్ట్రంలోని వివిధ దేవాలయాలు, చర్చిలు, దర్గాలకు తీసుకెళ్లి పార్టీ ఫిరాయింపులకు పాల్పడబోమని దేవుని ఎదుట ప్రమాణం చేయించారు కాంగ్రెస్‌ పెద్దలు. కాంగ్రెస్‌ నుంచి ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న సీనియర్‌ నేత చిదంబరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని