రాజన్న ఆలయంపై నిర్లక్ష్యం ఎందుకు?

దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా

Published : 25 Jan 2022 05:09 IST

ముఖ్యమంత్రికి బండి సంజయ్‌ ప్రశ్న

వేములవాడ గ్రామీణం, గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. రాజన్న పేదల దేవుడని, అలాంటి ఆలయంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. దర్శనానికి వచ్చిన భక్తులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రసాద్‌ పథకం కింద ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినా ఇప్పటికీ ఇవ్వలేదని సంజయ్‌ పేర్కొన్నారు. తెలంగాణాలో భాజపా పుంజుకుంటుందని సర్వేలు చెప్పాయని, రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి

తెలంగాణలో ఖాళీగా ఉన్న 44 వేల ఉపాధ్యాయ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని సంజయ్‌ సోమవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని, దేశవ్యాప్తంగా విద్యా రంగంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉండటమే దీనికి నిదర్శనమన్నారు. బీఈడీ, డీఈడీ, పండిట్‌ శిక్షణ, పీఈటీ పూర్తి చేసిన దాదాపు 7 లక్షల మంది నిరాశలో ఉన్నారని గుర్తు చేశారు. మైనారిటీ, ఎయిడెడ్‌ సంస్థల్లో వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటినీ భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు