తెరాసకు చిత్తశుద్ధి లేదు

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో తెరాసకు చిత్తశుద్ధి లేదని, పేదల జీవితాల్లో మార్పు తెచ్చే హామీలను ఆ పార్టీ విస్మరించిందని సీపీఎం రాష్ట్ర మహాసభ విమర్శించింది. ప్రధానంగా పెట్టుబడిదారులు, గుత్తేదారులు, భూస్వాములు, ధనిక రైతులు, వ్యాపార

Published : 25 Jan 2022 05:09 IST

హామీలు మరిచి పెట్టుబడిదారులకు పెద్దపీట
సీపీఎం రాష్ట్ర మహాసభ రాజకీయ తీర్మానం

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో తెరాసకు చిత్తశుద్ధి లేదని, పేదల జీవితాల్లో మార్పు తెచ్చే హామీలను ఆ పార్టీ విస్మరించిందని సీపీఎం రాష్ట్ర మహాసభ విమర్శించింది. ప్రధానంగా పెట్టుబడిదారులు, గుత్తేదారులు, భూస్వాములు, ధనిక రైతులు, వ్యాపార వాణిజ్య వర్గాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆరోపించింది. సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో ప్రజలు పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని మహాసభ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే వామపక్ష శక్తులు కేంద్రంగా ప్రజాస్వామిక, వర్గ, సామాజిక శక్తుల ఐక్య ప్రత్యామ్నాయమే మార్గమని స్పష్టం చేసింది. సీపీఎం రాష్ట్ర 3వ మహాసభల్లో భాగంగా సోమవారం రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. అందులోని ముఖ్యాంశాలు..

రాష్ట్రానికి ఏడేళ్లలో రూ.2,86,000కోట్ల అప్పులయ్యాయి. వాటిని తీర్చే భారం ప్రజలపై పడనుంది. దళితులు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు తదితర వర్గాలకు కేటాయించిన బడ్జెట్‌లో పెద్దఎత్తున కోత పెడుతున్నారు. నిర్మాణ, వైద్య, ఫార్మా వంటి రంగాల్లో ఆదాయాలకు కరోనా కాలంలో ఆటంకం కలగలేదు. సాధారణ ప్రజల ఆదాయాలు మాత్రం పెరగలేదు. రుణమాఫీ నేటికీ  పూర్తిగా అమలు కాలేదు.  ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు నష్టపోతున్నారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల సాగుభూమి.. కేజీనుంచి పీజీవరకూ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేయడంలేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయలేదు. ఒప్పంద, పొరుగు సేవల విధానం రద్దు హామీ అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆసరా చేసుకొని భాజపా బలపడాలని ప్రయత్నిస్తోంది. ఇంతజరుగుతున్నా తెరాసనాయకత్వం.. భాజపా, కేంద్ర ప్రభుత్వాలపై మెతక వైఖరి అవలంభిస్తోంది. కాంగ్రెస్‌ వైఖరి భాజపా బలపడడానికే ఉపయోగపడుతోంది. రాజకీయ తీర్మానంతోపాటు మరికొన్ని తీర్మానాలు  కూడా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని