రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకులు

‘‘రాష్ట్రం పలు అంశాలలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో దూసుకుపోతుంటే.. కేంద్ర ప్రభుత్వం పైసా ఇవ్వడం లేదు. కేవలం మాటలు, ప్రశంసలతోనే కాలం వెళ్లదీస్తోంది. ప్రగతి, పాలనకు సంబంధించిన విషయాలలో అడ్డు

Published : 26 Jan 2022 05:05 IST

హక్కులను హరించే యత్నం: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘రాష్ట్రం పలు అంశాలలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో దూసుకుపోతుంటే.. కేంద్ర ప్రభుత్వం పైసా ఇవ్వడం లేదు. కేవలం మాటలు, ప్రశంసలతోనే కాలం వెళ్లదీస్తోంది. ప్రగతి, పాలనకు సంబంధించిన విషయాలలో అడ్డు తగులుతోంది’’ అని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు విమర్శించారు. క్రైస్తవ సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నాయకత్వంలో మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు స్వేచ్ఛగా పని చేయకుండా అఖిల భారత సర్వీసు నిబంధనలు సవరించి రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించే ప్రయత్నాలు చేస్తోంది. అధికారాలను పూర్తిగా కేంద్రీకృతం చేస్తోంది. తెలంగాణ దేశంలోనే గొప్ప లౌకిక రాష్ట్రం. వివక్షకు ఏ మాత్రం తావు లేకుండా, బేధ భావం లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికి వర్తింపజేస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది’’ అని అన్నారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ హిందూ ధర్మాన్ని పాటిస్తున్నా అన్ని కులాలు, మతాలు, వర్గాలను సమదృష్టితో చూస్తున్నారని అన్నారు. అభివృద్ధి ఫలాలను అందరికీ అందిస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజయ్య, స్టీఫెన్‌సన్‌, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, ఆహార కమిషన్‌ సభ్యుడు ఆనంద్‌, క్రైస్తవ ఆర్థిక సంస్థ ఎండీ కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని