ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తెరాస

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దుయ్యబట్టారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన

Published : 27 Jan 2022 04:11 IST

పోలీసుల సమక్షంలో అర్వింద్‌పై దాడి: బండి సంజయ్‌

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దుయ్యబట్టారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన సాగుతోందన్నారు. కవులు, కళాకారులు, పాత్రికేయులు, ఎంపీలపై దాడులు చేస్తూ అరాచకానికి పాల్పడుతోందని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో ఎంపీ అర్వింద్‌పై దాడులు చేశారన్నారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ..  పద్మ పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి కొవిడ్‌ టీకా అందించిన భారత్‌ బయోటెక్‌ అధినేత కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య, గిరిజన చరిత్రను భావితరాలకు అందిస్తున్న రాంచంద్రయ్య, కూచిపూడి నృత్యానికి వన్నె తెచ్చిన పద్మజారెడ్డికి పురస్కారాలు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని