రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న మోదీ, కేసీఆర్‌: రేవంత్‌

ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాస్తూ నరేంద్రమోదీ, కేసీఆర్‌లు నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

Published : 27 Jan 2022 04:12 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాస్తూ నరేంద్రమోదీ, కేసీఆర్‌లు నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రధానంగా యువత ప్రజలకు అండగా ఉండాలని, హక్కులను సాధించేందుకు వారికి మద్దతుగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పొన్నాల, షబ్బీర్‌అలీ, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మహేష్‌కుమార్‌గౌడ్‌, హర్కర వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ‘‘దేశానికి కాంగ్రెస్‌ ప్రసాదించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరించి మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలు రాచరిక పాలన చేస్తున్నాయి’’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని