నన్ను చంపడానికి కుట్ర జరిగింది: ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌ జిల్లా ఇస్సాపల్లి వద్ద మంగళవారం తనపై దాడి చేసింది అంతా తెరాస వాళ్లేనని.. తనని చంపేందుకు కుట్ర జరిగిందని భాజపా నేత, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. ఈ ఘటనపై

Published : 27 Jan 2022 04:14 IST

ఈనాడు, హైదరాబాద్‌, దిల్లీ, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఇస్సాపల్లి వద్ద మంగళవారం తనపై దాడి చేసింది అంతా తెరాస వాళ్లేనని.. తనని చంపేందుకు కుట్ర జరిగిందని భాజపా నేత, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రికి, లోక్‌సభ స్పీకర్‌, ప్రివిలేజ్‌ కమిటీతో పాటు రాష్ట్ర హోంమంత్రి, డీజీపీలకూ ఫిర్యాదుచేస్తానని చెప్పారు. తనపై జరిగిన దాడిని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి కేటీఆర్‌ వర్యవేక్షించారని.. ఓ ప్రణాళిక ప్రకారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నిజామాబాద్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘నందిపేటకు వెళుతున్న నన్ను పోలీసులు ఓ చోట ఇరికించారు. నా ప్రాణాలు తీసేందుకు కాన్వాయ్‌తో ఒక దగ్గరికి తీసుకెళ్లి ఆపారు. తెరాస వాళ్లు వచ్చి దాడి చేస్తే ఒక్క పోలీసు కూడా సహాయం చేయలేదు. మా కార్యకర్తలే నా ప్రాణాలు కాపాడారు. హైదరాబాద్‌ నుంచి 25 మంది గూండాల్ని రప్పించారు. మా యువమోర్చా నాయకుడు విజయ్‌పై చాకుతో దాడిచేసిన వ్యక్తి జోర్పూరు రాము. అతను మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితతో, జీవన్‌రెడ్డితో దిగిన ఫొటోలు ఇవి’ అంటూ చూపించారు. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీకి టికెటివ్వమని బండి సంజయ్‌ని అడుగుతా’ అని అర్వింద్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతోనే తమ పార్టీ నేతలపై తెలంగాణలో వరుస దాడులు జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ఛుగ్‌ దిల్లీలో ఆరోపించారు.

15 మంది నిందితుల గుర్తింపు

ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్‌పై రాళ్లదాడి ఘటనలో 15 మంది అనుమానితులను వీడియోల్లో గుర్తించినట్లు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌ నాగరాజు చెప్పారు. పోలీసులపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని