గెలుపుతో బోణీ కొడతారా?

పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్‌.. ఈ దఫా పలువురు యువ అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. వారిలో- విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించినవారు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, మాజీ లెక్చరర్‌

Updated : 27 Jan 2022 05:34 IST

పంజాబ్‌లో పలువురు యువకిశోరాలకు కాంగ్రెస్‌ టికెట్లు

చండీగఢ్‌: పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్‌.. ఈ దఫా పలువురు యువ అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. వారిలో- విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించినవారు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, మాజీ లెక్చరర్‌ తదితరులతో పాటు ప్రముఖ నాయకుల వారసులూ ఉన్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఈ కుర్రకారు ఎలాంటి ఫలితాలను రాబడుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పోటీలో ఉన్న కొందరు కీలక యువ అభ్యర్థుల సంక్షిప్త వివరాలివీ..

మె సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ప్రముఖ నటుడు, వితరణశీలి సోనూ సూద్‌ సోదరి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే హర్‌జోత్‌ కమల్‌ను కాదనిమరీ మోగా సీటును కాంగ్రెస్‌ ఈమెకు కేటాయించింది.

రణ్‌వీర్‌కౌర్‌ మియాన్‌ (30)
ఆంగ్లంలో పీహెచ్‌డీ చేశారు. ఇటీవలి వరకు ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బుడ్‌లాడా నుంచి బరిలో దిగారు.


మోహిత్‌ మోహింద్ర (32)
రాష్ట్ర మంత్రి బ్రహ్మ్‌ మోహింద్ర కుమారుడు. పటియాలా (గ్రామీణ) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ పట్టా ఉంది. యువజన కాంగ్రెస్‌ నేతగా పనిచేశారు. ఔత్సాహిక క్రీడాకారుడు.


కామిల్‌ అమర్‌సింగ్‌ (34)
తేగఢ్‌ సాహిబ్‌ ఎంపీ అమర్‌ సింగ్‌ కుమారుడు. రాయ్‌కోట్‌ సీటులో బరిలో దిగారు. ఈయన బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఎంబీయే పూర్తిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌కు అధికార ప్రతినిధిగా ఉన్నారు.


సందీప్‌ జాఖడ్‌ (45)
రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ సోదరుడి కుమారుడు. అబోహర్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఫ్లోరిడా అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.

వీరితో పాటు గఢ్‌శంకర్‌లో బరిలో ఉన్న అమర్‌ప్రీత్‌సింగ్‌ లల్లీ, బల్లువానాలో పోటీకి దిగిన రాజేందర్‌ కౌర్‌, లంబీ నియోజకవర్గం టికెట్‌ దక్కించుకున్న జగ్‌పాల్‌సింగ్‌ అబుల్‌ ఖురానాలది కూడా యువరక్తమే. వీరంతా విజయంతో ఎన్నికల అరంగేట్రం చేస్తారని కాంగ్రెస్‌ ఆశిస్తోంది.


సిద్ధూ మూసేవాలా (28)

పంజాబీ గాయకుడు. యువతలో ఆదరణ ఎక్కువ. మాన్సా నుంచి పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని