
Updated : 28 Jan 2022 09:20 IST
Revanth Reddy: ఆ ఫైవ్‌స్టార్ పెళ్లిపై సీఎంవో విచారణకు ఆదేశిస్తుందా?
ట్విటర్‌లో రేవంత్‌రెడ్డి
గాంధీభవన్, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె వివాహాన్ని ఫైౖవ్‌స్టార్ హోటల్‌లో భారీ వ్యయంతో ఘనంగా చేశారని.. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశిస్తుందా? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా గురువారం ప్రశ్నించారు. ఈ ఖరీదైన వివాహానికి ఒక ప్రముఖ సంస్థ ఏర్పాట్లు చేసినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇందులో ఉన్న క్విడ్ ప్రో కోను బయటపెట్టాలని కోరారు.
Tags :