ట్విటర్‌లో నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గిస్తున్నారు: రాహుల్‌

 భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డుకట్ట వేసే కార్యక్రమంలో తనకు తెలియకుండానే ట్విటర్‌ భాగస్వామిగా మారుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఆక్షేపించారు. ఈ మేరకు గతేడాది డిసెంబర్‌ 27న ట్విటర్‌

Published : 28 Jan 2022 04:07 IST

దిల్లీ:  భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డుకట్ట వేసే కార్యక్రమంలో తనకు తెలియకుండానే ట్విటర్‌ భాగస్వామిగా మారుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఆక్షేపించారు. ఈ మేరకు గతేడాది డిసెంబర్‌ 27న ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌కు ఆయన రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో తన ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్యలో తగ్గుదలను రాహుల్‌ ప్రస్తావించారు. గత ఏడాది తొలి ఏడు నెలల్లో తనను అనుసరించే వారి సంఖ్య సగటున రోజుకు పది వేల చొప్పున పెరుగుతూ వచ్చిందని, ఆ తర్వాత ఆ సగటు సున్నాకు దగ్గర్లోకి వచ్చిందని తెలిపారు. ఈ ఆకస్మిక మార్పునకు కారణమేంటని ప్రశ్నించారు. ట్విటర్‌ ఇండియా ద్వారా ప్రభుత్వం తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో చాలా మంది నన్ను హెచ్చరించారని పేర్కొన్నారు. దీనిపై ట్విటర్‌ స్పందించింది. రాహుల్‌ ఖాతాను అనుసరించే వారి సంఖ్య సరిగ్గానే ఉందని తెలిపింది. నకిలీ ఖాతాలపై తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఆ క్రమంలో ఫాలోవర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని